ETV Bharat / state

ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసుల్లో ఏపీదే మెుదటి స్థానం

author img

By

Published : Jan 10, 2020, 8:59 AM IST

మహిళలపై లైంగిక దోపిడీకి పాల్పడేందుకు, వ్యభిచార వృత్తిలోకి దించేందుకు సాగుతున్న మానవ అక్రమ రవాణాలో దేశంలో ఏపీ రెండో స్థానంలో ఉంది. అతివల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో అయితే ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉంది.

high crime rate in ap
ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసుల్లో మెుదటి స్థానంలో ఏపీ

మహిళలపై లైంగిక దాడి, వ్యభిచార కూపంలోకి దించేందుకు సాగుతున్న దుశ్చర్యలు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన 2018 సంవత్సర నివేదికలో అతివల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉంది. ఆ ఏడాది దేశవ్యాప్తంగా అన్ని రకాల నేరాలు కలిపి 31లక్షల 32వేల 954 కేసులు నమోదు కాగా... వాటిలో లక్షా 26వేల 635 కేసులు ఏపీలోనే నమోదయ్యాయి.

వ్యభిచారంలోకి దించేందుకు సాగుతున్న మానవ అక్రమరవాణాలో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి మహిళల అక్రమ రవాణా సాగుతుండగా తర్వాత ఏపీ నుంచే ఎక్కువ మందిని తరలిస్తున్నారు. మహిళలు, వృద్ధులు, ఎస్సీలు, ఎస్టీలపై నేరాల్లో ఆర్థిక, సైబర్ నేరాల్లో, మానవ అక్రమ రవాణా కేసుల్లోనూ ఏపీ మొదటి పది స్థానాల్లోనే ఉంది.

మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాల్లో... సామాజిక మాధ్యమాల్లో వేధించిన కేసులే అధికంగా ఉన్నాయి. 971 అత్యాచార కేసులు నమోదవగా... వీటిల్లో 912 కేసుల్లో నిందితులు బాధితులకు పరిచయస్తులే. నిందితుల్లో బాధితుల కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇరుగు పొరుగువారు, ఆన్‌లైన్లో పరిచయమైన వారే ఉన్నారు.

ఇదీ చూడండి: మహిళపై వేధింపులు... సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.