జూనియర్ సివిల్ జడ్జీ ఉద్యోగాల భర్తీ విషయంలో న్యాయవాదిగా మూడేళ్ల అనుభవం లేకపోయినా పిటిషనర్ల దరఖాస్తులను స్వీకరించాలని రిజిస్ట్రార్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల ఎంపిక అంశం హైకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని తెలిపింది. కేసులో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ ఏడాది జూన్ 17 న జారీ చేసిన జూనియర్ సివిల్ జడ్జిల భర్తీ నోటిఫికేషన్ అభ్యర్ధులకు మూడేళ్లు న్యాయవాదిగా కనీస అర్హత ఉండాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు లేని నిబంధన ఆంధ్రప్రదేశ్ లో ఎందుకని... కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఇది కూడా చదవండి.