కూచిపూడి గ్రామంలో చేపల చెరువు లీజు ఆక్షన్పై దేవాదాయశాఖ ఇచ్చిన నోటీసును సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చేపల చెరువుకు లీజు ఆక్షన్ వేస్తామని దేవాదాయశాఖ ఇచ్చిన నోటీసులపై గ్రామ అభివృద్ధి సొసైటీ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది. చేపల చెరువు దేవాదాయశాఖ భూమి కాదని పిటిషనర్ న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. నోటీసులు ఇచ్చే అధికారం దేవాదాయశాఖకు లేదని న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం నోటీసులను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
Viveka Murder case : సీబీఐ వేసిన ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు