రాష్ట్రంలో మాదక ద్రవ్యాల దందా ఆగడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో తాజాగా రూ. 3 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున గంజాయిని తెచ్చి.. చింతూరు, మోతుగూడెంలో నిల్వచేస్తూ.. అక్కడినుంచి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. దీనిపై నిఘా ఉంచిన పోలీసులు.. ఒక్కసారిగా దాడి చేశారు.
రవాణాకు సిద్ధం చేసిన 3వేల 350 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. మార్కెట్‌లో దీని విలువ మూడున్నర కోట్లు ఉంటుందన్నారు. . నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో పెద్దఎత్తున గుట్కా, ఖైనీని కూడా పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. జగ్గంపేట సర్కిల్‌లో 10 బస్తాల్లో చైనీ ఖైనీ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: