కృష్ణాజిల్లా నాగాయలంక మండలం దీనదయాల్పురం గ్రామంలో రొయ్యల చెరువు యజమానులు వినూత్నంగా ఆలోచించారు. ఊరు బయట ఉన్న రొయ్యల చెరువులపై ప్రజల దృష్టి పడకుండా ఉండేందుకు... చెరువు చుట్టూ హీరోయిన్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రోడ్డుపై వెళ్లేవారు చెరువు గట్టుపై ఉన్న ఆ హీరోయిన్ల ఫ్లెక్సీలను ఆసక్తిగా గమనిస్తూ చెరువును చూడటం లేదని రొయ్యల చెరువు యజమానులంటున్నారు. అలాగే మరోవైపు దేవుళ్ల ఆశీస్సుల కోసం వేరే ఫొటోలను సైతం పెట్టారు. ఇదిలావుంటే... ఆ ఫ్లెక్సీలను చూస్తూ చాలామంది రోడ్లపై గుంటల్లో పడి దెబ్బలు తగిలించుకున్న వారు కూడా ఉన్నారని పలువురంటున్నారు.
ఇదీ చూడండి