Chirnjeevi: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీ గోదారంగనాథుల కల్యాణ వేడుకల్లో....మెగాస్టార్ చిరంజీవి దంపతులు పాల్గొన్నారు. చిరంజీవి దంపతులకు...వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం చిరంజీవి దంపతులకు పండితులు ఆశీర్వచనాలు అందజేసి, ప్రసాదాన్ని అందించారు. దేవస్థానం ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. కల్యాణ వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమన్నారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డోకిపర్రు గ్రామంలో రాత్రి బస చేసిన చిరంజీవి దంపతులు ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్ పయనమవుతారు. దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తలు పి.పి.రెడ్డి, కృష్ణారెడ్డి, యంపి.వల్లభనేని బాలశౌరి కూడా కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: