కృష్ణాజిల్లా మైలవరం వైకుంఠధామంలో కరోనాతో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించడానికి... కుటుంబసభ్యులు, బంధుమిత్రులెవ్వరూ ముందుకు రాలేదు. ఈ పరిస్థితులలో ఎస్పీ సుధాకరరావు నేతృత్వంలో లయన్స్ వైకుంఠధామం (హిందూ శ్మశానవాటిక )ను పర్యవేక్షిస్తున్న శ్రీ షిరిడిసాయి సేవాదళ్ కార్యదర్శి బాలాజీ ప్రసాద్... విజయవాడ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్చంద సంస్థ వారితో మాట్లాడి దహన కార్యక్రమాలు నిర్వహించారు.
హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ చందన వెంకట్, హరి, రామకృష్ణ, శేష పవన్, కె.కృష్ణ తదితరులు విజయవాడ నుండి మైలవరం వచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. వారి సేవాగుణాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండి: