కృష్ణాజిల్లా నందిగామ మండలంలోని పలు రహదారులు జలమయ్యాయి. డీవీఆర్ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరగా.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దినసరి కూలీలు బయట ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. మోకాళ్ల లోతు నీటిలో ఎటూ కదలలేని పరిస్థితి నెలకొంది.
చాట్రాయి మండలంలోని పోలవరం పూర్తిగా జలమయమైంది. నలువైపుల ఉన్న వాగులు పొంగి.. రోడ్లమీద భారీ స్థాయిలో నీరు చేరింది. గ్రామం ద్వీపకల్పాన్ని తలపిస్తుండటంతో.. బ్యాంకులు, కార్యాలయాలకు సిబ్బంది చేరుకునే పరిస్థితి లేదు. అధికారులు వరదనీటిని మళ్లించి రాకపోకలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
తమ్మిలేరు జలాశయానికి ప్రవాహం పెరగగా.. చిన్నంపేట వద్ద నీటి ఉద్ధృతి పెరిగింది. ఐదు వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 2500 క్యూసెక్కులను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. వంతెన మీద నుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి: వాయుగుండం ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు