ఇవాళ ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని. వాతావరణశాఖ ప్రకటించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే అదనంగా 4 నుంచి 6 డిగ్రీల మేర ఉష్ణోగ్రత తీవ్రత పెరిగినట్టు ఐఎండీ ప్రకటించింది. వచ్చే నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేసింది. గుజరాత్, రాజస్థాన్ మీదుగా.. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణా, కోస్తాంధ్రల వరకూ ఉష్ణగాలులు వీస్తున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు.
మరో నాలుగైదు రోజులు.. భానుడి భగభగలే - heat_wave_condition
రాష్ట్రంలో భానుడి ప్రతాపం మరో నాలుగైదు రోజులు తీవ్రంగా ఉండనుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో 47 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఇవాళ ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని. వాతావరణశాఖ ప్రకటించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే అదనంగా 4 నుంచి 6 డిగ్రీల మేర ఉష్ణోగ్రత తీవ్రత పెరిగినట్టు ఐఎండీ ప్రకటించింది. వచ్చే నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేసింది. గుజరాత్, రాజస్థాన్ మీదుగా.. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణా, కోస్తాంధ్రల వరకూ ఉష్ణగాలులు వీస్తున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు.
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రకాశంజిల్లా వ్యాప్తంగా భానుడిభాగభగలతో ప్రజలు హడలిపోతున్నారు.చీరాల,వేటపాలెం, పర్చూరు,మార్టూరు ప్రాంతాల్లో భానుడు ప్రతాపంచూపుతున్నాడు. సాధారణం మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చీరాల,కారంచేడు లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చీరాల పట్టణంలోని ప్రధానరహదారులసైతం నిర్మానుష్యంగా మారాయి..తప్పనిసరైతే గానీప్రజలు బయటకు వచ్చే పరిస్దితిలేదు.. ఎండకు తోడు వడగాల్పులు తొడయ్యాయి.. మరో ఐదు రోజులు ఇలాగే ఎండలు ఉంటాయని అధికారులు తెలిపారు. నిన్న ఇంకొల్లు లో వడగాల్పులకు ఇద్దరు వృద్ధులు మృతిచెందారు.
Body:చీరాలలో భానుడి ప్రతాపం
Conclusion:కంట్రిబ్యూటర్: కె.నాగరాజు,చీరాల,ప్రకాశంజిల్లా, కిట్ నెంబర్ : 748