పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు శివనాథరెడ్డి, పోతుల సునీత అనర్హత పిటిషన్పై శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ వద్ద నేడు విచారణ జరగనుంది. పార్టీ విప్ ఉల్లంఘించినందున వారిపై అనర్హత వేటు వేయాలని తెదేపా ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, అశోక్ బాబుల ఫిర్యాదు మేరకు మండలి ఛైర్మన్ షరీఫ్ చర్యలు చేపట్టారు. ఈనెల మూడో తారీఖు విచారణకు రావాలని ఛైర్మన్ ఆదేశించగా పోతుల సునీత, శివనాథ రెడ్డి గైర్హాజరయ్యారు. తదుపరి విచారణ ఇవాళ ఉదయం 11 గంటలకు శాసన మండలి ఛైర్మన్ ఛాంబర్‌లో చేపట్టనున్నారు.
ఇదీ చూడండి..