విజయవాడలో గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ ఆధ్వర్యంలో శిక్కుల గురువు 550వ గురునానక్ ప్రకాష్ ఉత్సవ్ని ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ గురు సింగ్ సభ కమిటీ సభ్యులు గుర్జిత్ సింగ్ సహాని చెప్పారు. ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకూ గురునానక్ 550వ జయంతి ఉత్సవాలు అత్యంత భక్తి, శ్రద్ధలతో నిర్వహిస్తామని.. సర్వమతస్థులు ఇందులో ఆహ్వనితులేన్నారు. సర్వమత, సర్వమానవ సమానత్వం ప్రధానమని.. మతాలు ఏన్నైనా దేవుడు ఒక్కడే అని నమ్ముతామని తెలిపారు. 8వ తేదీ వరకూ ఉదయాన్నే దైవ ప్రార్థనలు చేస్తూ ప్రభాత్ పేరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. తమ మత గ్రంథాన్ని 48 గంటలపాటు నిర్విరామ అఖండ పాఠ్ పారాయణ కార్యక్రమం చేపడతామని... పంజాబ్లోని అమృతసర్ స్వర్ణదేవాలయ అర్చకులు వచ్చి ఇక్కడి అర్చకులతో పూజాదికాలు చేయనున్నారన్నారు. 10న ప్రత్యేక ఆకర్షణగా తమ మతాచార ఆయుధాలతో విన్యాసాలు చేస్తూ... నగర కీర్తన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. 12 వతేదీన గురునానక్ జయంతిని తమ పంజాబీలందరితో పాటు అన్యమతస్తులతో కలిసి ఘనంగా జరుపుకుంటామని సహానీ తెలిపారు.
ఇదీ చూడండి: