కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఅవుట్లపల్లిలోని సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో 2015 బీడీఎస్, 2017 ఎండీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్ధార్థ వైద్య కళాశాల పరిశోధన విభాగం అధ్యాపకులు ఈశ్వర్ హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ రామోజీరావు, అకాడమీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, డైరెక్టర్ జనరల్ నాగేశ్వరరావు తదితరులతో కలిసి విద్యార్థులకు ప్రొఫెసర్ ఈశ్వర్ డాక్టరేట్లు అందించారు. పట్టాలు అందుకున్న విద్యార్థులు ఉత్తమ వైద్యులుగా ఎదిగి, సమాజంలో మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఇవీచదవండి.