కరోనా నివారణకు ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాలని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సూచించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి వారికి వెంటనే టెస్టులు నిర్వహించాలన్నారు. కరోనా తీవ్రత, కట్టడికి చేపడుతున్న నివారణ చర్యలు, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై వైద్యులతో చర్చించారు.
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సమన్వయంతో పనిచేయాలని ఉదయభాను సూచించారు. కరోనా టెస్టులు చేసేందుకు అవసరమైన పరికరాలు, కొవిడ్ వాహనం అందుబాటులో లేదని వైద్యులు ఉదయభాను దృష్టికి తీసుకువచ్చారు. దీంతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, డీఎంహెచ్‌వోతో సామినేని ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. 24 గంటల్లో రాపిడ్ కిట్లు, పీపీఈ కిట్లు, కొవిడ్ వాహనాన్ని అందజేస్తామని అధికారులు తెలిపినట్లు ఉదయభాను వెల్లడించారు.
ఇదీ చదవండి: 'కరోనాతో వైద్యులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు'