CM Chandrababu Suggestions to MLAs on Budget : ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి రానురాను తగ్గుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలని సూచించారు. రాష్ట్రంతోపాటు కేంద్ర బడ్జెట్‌లోనూ నిధుల కేటాయింపులపై ఎమ్మెల్యేలందరూ స్టడీ చేయాలని వ్యాఖ్యానించారు. పని చేయాలనే ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని సీఎం స్పష్టం చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు జరిగింది. పార్లమెంట్ రీసెర్చ్ స్టడీస్ సభ్యులు బడ్జెట్‌పై వారికి అవగాహన కల్పించారు. సదస్సులో భాగంగా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అసెంబ్లీలో ఎవరెవరు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నారో తాను కూడా నోట్ చేసుకుంటున్నానని సీఎం అన్నారు.
సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముంది అని అనుకోవద్దని వాళ్లకు బాధ్యత లేదు కానీ మనకు ఉందని సీఎం సూచించారు. మనం అందరం కలిసి ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అసెంబ్లీకి తాము పంపిన ప్రతినిధి తమ కోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడూ గమనిస్తారని అన్నారు. సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో స్వాగతించరని, గతంలో అదే జరిగిందని తెలిపారు. శాఖల్లో ఏం జరుగుతుందో నాయకులకు అవగాహన లేకపోతే నియోజకవర్గానికి ఏం అవసరమో వారికి తెలియదని అన్నారు. బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలని వచ్చే మంచి ఆలోచనలు సభలో పంచుకోవాలని సీఎం సూచించారు.
బడ్జెట్‌పై ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు - స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏమన్నారంటే!
ప్రతి పాలసీలపై అధ్యయనం చేయాలి: ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలని చంద్రబాబు తెలిపారు. పబ్లిక్ గవర్నెన్స్‌లో ఎమ్మెల్యేలనూ భాగస్వామలను చేస్తామని అన్నారు. అర్థవంతమైన చర్చలకు సభ వేదిక కావాలని అన్నారు. వరుసగా విజయం సాధించడం అనేది మన పనితనం, పార్టీ నిర్మాణాన్ని బట్టి ఉంటుందని తెలిపారు. టీడీపీ నుంచి 61 మంది, జనసేన నుంచి 15 మంది, బీజేపీ నుంచి నలుగురు, వైఎస్సార్సీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికయ్యారని వివరించారు. ఒకప్పుడు అసెంబ్లీ ప్రొసెడింగ్స్ ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌లో వచ్చేవని కానీ ఇప్పుడు లైవ్, సోషల్ మీడియాలో కూడా ప్రసారం అయ్యేలా టెక్నాలజీ వచ్చిందని సీఎం అన్నారు.
రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటా: మనం తెచ్చే పాలసీలే రాష్ట్రంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారాలను చూపిస్తాయని సీఎం తెలిపారు. విజన్-2047పై అందరి అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. మంచి చర్చ, సమస్యల పరిష్కారానికి శాసన సభ, శాసన మండలి ఇకపై వేదికగా నిలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అంతే కాకుండా ఈ సదస్సులో సీఎం చంద్రబాబు 9సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన అనుభవాలు పంచుకున్నారు. ఎమ్మెల్యేలు రాష్ట్ర సంపదగా తయారు కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా అసెంబ్లీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తానే సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నా రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటానని తెలిపారు. సమావేశాలను ప్రతీ ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.
జగన్ అక్రమాస్తుల కేసు - సుప్రీంకోర్టులో కీలక పరిణామం
ఎంపీ అవినాష్ చెబితేనే రాఘవరెడ్డి నోట్ చేసుకొని వర్రాకు ఇచ్చాడు : డీఐజీ కోయ ప్రవీణ్