కరోనా చికిత్స అందిస్తూ వైరస్ సోకి మరణించిన వైద్యుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని.. ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర కన్వీనర్ డా .జయధీర్ అన్నారు. లేని యెడల న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు ప్రభుత్వ వైద్యులు వైరస్ బారిన పడి మృతి చెందారని పేర్కొన్నారు. ఈ అంశంపై గతంలో ప్రభుత్వ ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించగా... అధికారుల నుంచి ఎలాంటి హామీ లేదని వాపోయారు.
కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు పీఆర్సీ పెంచాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సత్వరమే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు కొవ్వొత్తుల నిరసన చేస్తామని జయధీర్ తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శితో మంగళవారం సమావేశమవుతామని తెలిపారు.
ఇదీచదవండి.