తాజా పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ను ప్రతి ఒక్కరు పాటించాలని... రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. రాజ్భవన్లో వివిధ విభాగాల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి 9 తొమ్మిది గంటల వరకు ప్రతిఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని కోరారు. జనతా కర్ఫ్యూ స్వయం నియంత్రణకు ఓ సంకేతమని... ప్రతిఒక్కరూ కనీసం 10 మందికి ఈ సందేశాన్ని చేరవేసి ప్రజలను చైతన్యపర్చాలన్నారు. ప్రభుత్వం, పౌర సమాజం సంయుక్తంగా ఈ మహమ్మారిని కట్టడి చేయొచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గవర్నర్కు వివరించారు.
'ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూను పాటించాలి' - జనతా కర్ఫ్యూ వార్తలు
ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూను పాటించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కోరారు. కరోనాపై రాజ్భవన్లో వివిధ విభాగాల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎవరికి వారు తమ వరకు రాదులే అనే భావనలో ఉండొద్దని సూచించారు.
!['ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూను పాటించాలి' Governor's High-Level Review on Corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6491141-252-6491141-1584791566226.jpg?imwidth=3840)