రానున్న రోజుల్లో భారతదేశం విద్యారంగానికి కేంద్ర బిందువుగా ఉంటుందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడలోని కాకరపర్తి భావనారాయణ కళాశాల 55వ వ్యవస్థాపక దినోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గవర్నర్తో పాటు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇతర దేశాలకు మన దేశం నైపుణ్యం కలిగిన వ్యక్తులను అందిస్తోందని... పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గవర్నర్ సూచించారు. కాలుష్యం వల్ల దేశ రాజధాని దిల్లీని వదిలి ప్రజలు వలస పోతున్న పరిస్థితి నెలకొందన్నారు. కేబీఎన్ కళాశాల మంచి విద్య అందించడమే ధ్యేయంగా ఏర్పాటయ్యిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గవర్నర్ ఉపకార వేతనాలు అందించారు.
'పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేయాలి' - విజయవాడలో కేబీఎన్ లో గవర్నర్ వార్తలు
విజయవాడ కాకరపర్తి భావనారాయణ కళాశాల 55వ వ్యవస్థాపక దినోత్సవంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటాలని గవర్నర్ సూచించారు.