కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఎన్‌ఏబీఎల్, ఐసీఎంఆర్ అనుమతి పొందిన ల్యాబ్‌లలో కొవిడ్ టెస్టులు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టెస్టుల ధరను నిర్ణయిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు వెలువరించింది. ప్రైవేటు ల్యాబ్‌లు.. వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు ప్రతిపాదనలు పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులకు కరోనా టెస్టుల ధరల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది.
ఇదీ చూడండి. 'ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో ఇతర నిర్మాణాలు చేపట్టొద్దు'