ETV Bharat / state

శిథిలావస్థలో ప్రభుత్వ కళాశాలలు.. ఇబ్బందుల్లో విద్యార్థులు - కృష్ణా జిల్లాలో శిథిలావస్థలో ప్రభుత్వ కళాశాలలు

కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రభుత్వ కళాశాలలు దుస్థితిలో ఉన్నాయి. కొన్నింటిలో కనీస సౌకర్యాలు కరవయ్యాయి. దీంతో కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించడంలేదు.

government colleges damaged stage in krishna district
కృష్ణా జిల్లాలో శిథిలావస్థలో ప్రభుత్వ కళాశాలలు
author img

By

Published : Nov 18, 2020, 4:37 PM IST

కృష్ణా జిల్లాలో ప్రభుత్వ కళాశాలల పరిస్థితి అధ్వానంగా ఉంది. కొన్నింటిలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కంచికచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరిస్థితి దారుణంగా ఉంది. 21 ఎకరాల ఆవరణలో ఉన్న ఈ కళాశాల ప్రస్తుతం కంప, పిచ్చి చెట్లతో అడవిని తలపిస్తోంది. కాలేజీకి వెళ్లేందుకు సరైన రోడ్లు లేవు. భవనం ఎక్కడికక్కడ పెచ్చులూడిపోతోంది. తరగతి గదుల్లో ఫ్లోరింగ్ దెబ్బతింది. విద్యుత్ బోర్డులు, పైపులు ఊడిపోయి వేలాడుతున్నాయి.

రాత్రి వేళ్లలో కళాశాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. మందుబాబులకు వేదికగా మారింది. ప్రహరీ గోడ నిర్మాణానికి గతేడాది రూ. 90 లక్షలు మంజూరు చేసినా.. ఇంకా నిధులు విడుదల కాలేదు. ప్రస్తుతం కళాశాలలో 30 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ శిథిలావస్థ కాలేజీలో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావట్లేదు.

నూజివీడులోని మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో త్రాగునీటి సౌకర్యం లేదు. బోధనేతర సిబ్బంది పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. జీఎఫ్​సీ కోర్సుకు పోస్టులు మంజూరు చేయలేదు. అలాగే... మైలవరంలోని వీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పలు సమస్యలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. త్రాగునీటి సమస్య ఉంది. భవనాలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. వీటి కోసం నాడు -నేడులో ప్రతిపాదనలు పంపినా... నిధులు మంజూరు కాలేదు. అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పరిస్థితిని మార్చాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాల పునఃప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.