కృష్ణాజిల్లా నాగాయలంకలో సంప్రదాయ గోరింటాకు, మెహందీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్దఎత్తున మహిళలు, చిన్నారులు, యువతులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో అందరూ మెహందీ పెట్టుకోవడంవైపే ఆసక్తి చూపుతున్నారు. కోన్లు, రకరకాల పద్ధతుల్లో కృత్రిమంగా తయారుచేసినవి వాడుతున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఆకునే వినియోగిస్తున్నారు. ఈ పాత సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పోటీలు ఏర్పాటుచేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
గోరింటాకు చేతులకు అందాన్నే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుందంటున్నారు బామ్మలు. గోరింటాకు పెట్టుకుంటే మానసిక రుగ్మతలు తొలగి ప్రశాంతత చేకూరుతుందనీ.. గోర్లలో ఉండే క్రిమికీటకాలు నశిస్తాయని చెప్తున్నారు. అందుకే ఏటా ఆషాఢమాసంలో అందరూ గోరింటాకు పెట్టుకోవాలని నేటి తరానికి సూచిస్తున్నారు.
ఇవీ చదవండి..
పోలవరం ప్రాజెక్టులో అవతకతవకలు జరిగినట్టు ఫిర్యాదుల్లేవు: కేంద్రం