రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజల ఆరోగ్యానికి తమ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఇప్పటికే 16 ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు.. కోవిడ్ బాధితుల మరణాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు.
మరోవైపు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే... ప్రతిపక్షం అడ్డుపడుతోందని ఆళ్ల నాని విమర్శించారు. కోర్టుల్లో కేసులు వేయించి... పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటోందని ఆరోపించారు.