కృష్ణా జిల్లా విజయవాడ, గుణదల మూడు వంతెనల సెంటర్ ప్రాంతంలో స్థానిక గోసంరక్షణ సమితి సభ్యులు గోమాతకు సీమంతం నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని గోవుకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం చీరలతో తమ ఇంటి ఆడబిడ్డకు చేసేలా తంతు జరిపారు. ఒక అమ్మాయికి చేసినట్లుగానే సీమంతం క్రతువును భక్తి శ్రద్ధలతో పూర్తి చేశారు.
ఇదీ చూడండి: