ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా భోగి మంటల్లో జీవో నెం1 ప్రతులు.. - ఏపీలో భోగి వేడుకలు

TDP leaders Bhogi Celebrations Across the state : జీవో నెంబర్​ 1పై టీడీపీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. వివిధ జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు జీవో నెం1 ప్రతులను మంటల్లో వేసి..సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి అని నినదిస్తూ భోగి పండుగను జరుపుకున్నారు.

భోగి వేడుకలు
భోగి వేడుకలు
author img

By

Published : Jan 14, 2023, 7:43 PM IST

TDP leaders Bhogi Celebrations Across the state: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులంతా జీవో నెెం1 ప్రతులను భోగి మంటల్లో వేసి కాల్చేశారు. అలాగే సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి అని నినాదాలు చేస్తూ భోగి వేడుకలు జరుపుకున్నారు. జిల్లాల వారీగా నాయకుల స్పందన ఇలా ఉంది.

ప్రకాశం జిల్లా కనిగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ ఇంచార్జ్ ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయం వద్దకు వేకువజామునే చేరుకుని భోగిమంటలతో సంక్రాంతి పండగకు స్వాగతం పలికారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ పార్టీ శ్రేణులు భోగిమంట వేశారు. యర్రగొండపాలెం టీడీపీ ఆధ్వర్యంలోనూ భోగి వేడుకలు నిర్వహించారు.

కడప జిల్లాలో ప్రతిపక్షాలకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జీవో నెంబర్ ఒకటిని సైతం కోర్టు తప్పు పట్టిందని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి తీసుకొచ్చిన చీకటి జీవో నెంబర్ ఒకటిని ప్రతులను కడప కోటిరెడ్డి కూడెలి వద్ద భోగిమంటల వేసి దగ్ధం చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను కూడా భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు.

అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం..రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ద్వారా సంక్రమించిన భావ ప్రకటన స్వేచ్ఛకు ఇది విఘాతం. అన్నారు.. జనవరి 23 వరకు సస్పెండ్ చేస్తూ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం హర్షణీయం.. ప్రభుత్వం బే షరతుగా ఈ జీవోను ఉపసంహరించు కోవాలని పీసీసీ మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి అన్నారు.

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో భోగిమంటల్లో టీడీపీ నేతలు జీవో నెంబర్ 1 ప్రతులను దగ్ధం చేశారు. గాంధీనగర్ సర్కిల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ ఒకటి ప్రజలను దగ్ధం చేశారు. మూడు రాజధానులు వద్దని, సైకో పాలన పోవాలని నినాదాలు చేశారు. హిందూపురం పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు.

గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు జీవో నెంబరు ఒకటి కాపీ పత్రాలను భోగి మంటల్లో వేసి తగుల పెట్టారు. తాడేపల్లిలో ఆ పార్టీ నేతలు జీవో నెంబరు 1 పత్రాలను భోగి మంటల్లో వేశారు. సైకో పోవాలని.....సైకిల్ తిరిగి రావాలంటూ నినాదలు చేశారు. బ్రిటీష్ కాలం నాటి జీవోలను అమల్లోకి తీసుకువచ్చి ప్రజాస్వామ్య గొంతును నొక్కాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు జీవో నెంబర్ కాపీలను భోగిమంటల్లో వేసి దహనం చేశారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ ఒకటి కాపీలను భోగిమంటల్లో దగ్ధం చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు స్థానిక నాయకులు ఆధ్వర్యంలో కాపీలను భోగిమంటల్లో వేసి తగలబెట్టారు. అలాగే జగ్గయ్యపేటలో కూడా జీవో నెం1 ప్రతులను టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్​ తాతయ్య భోగిమంటల్లో వేసి దహనం చేశారు.

వైఎస్సార్ జిల్లాలో.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వెల్లువెత్తుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం జీవో నెం1ని తీసుకొచ్చారని జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్​ఛార్జ్​ భూపేష్​రెడ్డి విమర్శించారు. సంక్రాంతి సందర్బంగా శనివారం జమ్మలమడుగు మండలం పొన్నతోట గ్రామంలో పర్యటించారు. కార్యక్రమానికి హాజరై భోగి మంటల్లో జీవో నెంబర్ ఒకటి ప్రతులను దహనం చేశారు.

అద్దంకి పట్టణంలో పలుచోట్ల భోగి మంటలు భారీగా వేశారు. భోగ మంటలు వేసే సమయంలో యువకులు జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో వేసిన భోగి మంటలలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన చీకటి జీవో ప్రతులను దగ్ధం చేశారు. దర్శి టీడీపీ ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. మాజీ ఎమ్మెల్యే పాపారావు, నగర పంచాయతీ చైర్మన్ పిచ్చయ్య, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన చీకటి జీవో ప్రతులను భోగి మంటల్లో వేశారు.

బాపట్ల జిల్లా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు పోయాయని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరులోని ఎన్టీఆర్ పుర వేదిక వద్ద నిర్వహించిన భోగి వేడుకలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి అంటూ నినాదాలు చేశారు. జగన్ దుర్మార్గపు పాలనలో వస్తున్న జీవోలు అన్ని నశించాలని ఆనందబాబు అన్నారు.

అనంతపురం జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగిమంటల్లో జీవో నెంబర్ వన్ ప్రతులు దగ్ధం చేశారు. రాయదుర్గం పట్టణంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు జీవో నెంబర్​ ొ ప్రతులను భోగిమంటల్లో వేసి కాల్చివేశారు.

విపక్ష నేతలను జనంలో తిరక్కుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవో పత్రాలను గుంతకల్ పట్టణంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద భోగి మంటల్లో దహనం చేశారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదలవలస బూర్జ సరుబుజ్జిలి పొందూరు మండలాల్లో అన్ని గ్రామాల్లో టీడీపీ నాయకులు భోగి మంటల్లో జీవో నెంబర్​ 1 ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సైకో సీఎం పోవాలని, సైకిల్ సీఎం రావాలని నినాదాలు చేశారు.

కృష్ణాజిల్లా... పెనమలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్​ఛార్జ్​, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఆయన కార్యాలయం వద్ద భోగి మంటలను వేశారు. దీనిలో భాగంగా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో ప్రతులను మంటల్లో వేసి కాల్చారు. అనంతరం మాట్లాడుతూ రాక్షస పాలనకు తుది దశకు వచ్చిందని, రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని అన్నారు.

అనకాపల్లి జిల్లా.. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చీకటి జీఓ నం.1ను రద్దు చేయాలని మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు డిమాండ్ చేశారు. టీడీపీ అధిష్టానం పిలుపుమేరకు మాడుగుల నియోజకవర్గం మండల కేంద్రం చీడికాడలో భోగిమంటల్లో జీవో ప్రతులను దగ్ధం చేశారు. సైకో పోవాలి.. సైకిల్ పాలను రావాలి.. అంటూ నినాదాలు చేశారు.

విశాఖ జిల్లా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ వన్, సైకో దిష్టిబొమ్మను భీమునిపట్నం టీడీపీ కార్యాలయం ఎదుట భీమునిపట్నం నియోజకవర్గం టీడీపీ ఇన్​ఛార్జ్​ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో దగ్ధం చేశారు పార్టీ కార్యాలయం ఎదుట భోగి మంటలు వేసిన అనంతరం భోగిమంటల్లో ప్రజా వ్యతిరేక జీవోలను దగ్ధం చేశారు.

పల్నాడు జిల్లా సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద భోగి పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలపై ఉక్కు పాదం మోపుతూ సభలను ర్యాలీలను నిషేదిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకు వచ్చిన చీకటి జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉత్తర్వు ఒకటి ప్రతులను భోగి మంటల్లో వేసి కాల్చి నిరసన తెలిపారు. ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం జీవో ఒకటి తెచ్చిందని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.

విజయనగరం జిల్లాలో భోగి సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగిమంటల్లో వైసీపీ ప్రభుత్వం అర్ధాంతరంగా విడుదల చేసిన జీవో వన్ పేపర్లను పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ముల్లు రమణ, కార్యకర్తలు దగ్ధం చేశారు.

నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఇంటి ఎదుట ఏర్పాటు చేసిన భోగి మంటల్లో జీవో నెంబర్​ 1 ప్రతులను తగులబెట్టారు. జీవో నెంబర్ 1 ని వెంటనే రద్దు చేయాలని వారు నినాదాలు చేశారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని గౌరు చరిత అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.