విజయవాడ బందరు కాలువలో ప్రమాదవశాత్తు పడి పదకొండేళ్ల బాలిక గల్లంతయ్యింది. చెత్త పారవేసేందుకు కాలువ వద్దకు వచ్చిన బాలిక కాలు జారి ప్రమాదవశాత్తు కాలువలో పడిందని స్థానికులు చెబుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి బాలిక ఆచూకీ కోసం వెతుకుతున్నారు.
నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కిందకు కొట్టుకొనిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా.. ఉదయం పది గంటలకు ప్రమాదం జరిగితే.. మధ్యాహ్నం రెండు గంటల వరకు అధికారులు స్పందించలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: