ETV Bharat / state

'ఎస్టీ మహిళనన్న కారణంతోనే ఇళ్ల పట్టాల పంపిణీకి ఎమ్మెల్యే పిలవలేదు' - కృష్ణా జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ వార్తలు

గన్నవరం మార్కెట్ యార్డ్ ఛైర్​ పర్సన్ భూక్యా ఉమాదేవి ఆవేదన చెందారు. ఎస్టీ మహిళన్న నెపంతోనే తనను ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆహ్వానించలేదని ఆరోపించారు.

Gannavaram Market Yard Chairman Bhukia Umadevi
గన్నవరం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ భూక్య ఉమాదేవి
author img

By

Published : Dec 28, 2020, 8:39 AM IST

తన స్వగ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ... కనీసం తనను ఆహ్వానించలేదని గన్నవరం మార్కెట్ యార్డ్ ఛైర్​పర్సన్ భూక్యా ఉమాదేవి ఆవేదన చెందారు. ఎస్టీ మహిళన్న నెపంతోనే సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే తీరును తప్పుబట్టారు. ఈ విషయమై.. స్థానిక యార్డ్ ఆవరణలో విలేకరులతో ఆమె మాట్లాడారు.

సర్పంచ్​గా, నాయకురాలిగా.. వైకాపా అభివృద్ధికి పదేళ్లుగా కష్టపడ్డ తమను పట్టించుకోకుండా తెదేపా వారిని ఎమ్మెల్యే వంశీమోహన్ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండా ఎమ్మెల్యే ఇళ్ల స్థలాల పట్టాలిస్తున్నట్లు ఆయన అనుచరులు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ప్రవర్తనపై తనలాంటి శాశ్వత కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:

ఇవాళ కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.