ETV Bharat / state

సీబీఐ విచారణకు హాజరైన తెలంగాణ మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్ర - సీబీఐ ముందు హాజరైన గంగుల కమలాకర్

Gangula Kamalakar Attended CBI Investigation: నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌ కేసులో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. సీబీఐ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతామన్నారు. వ్యక్తిగతంగా శ్రీనివాస్‌తో ఎలాంటి సంబంధాలు లేవని గంగుల, వద్దిరాజు పేర్కొన్నారు.

సీబీఐ విచారణకు హాజరైన తెలంగాణ మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్ర

author img

By

Published : Dec 1, 2022, 4:19 PM IST

Gangula Kamalakar Attended CBI Investigation: దిల్లీలో అరెస్టయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌ కేసులో విచారణలో భాగంగా నేడు కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణకు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. ఖమ్మంలో జరిగిన కాపు సంఘం సమావేశంలో శ్రీనివాస్‌తో ఫొటో దిగానని గంగుల పేర్కొన్నారు. ఆ ఫొటోల ఆధారంగానే సీబీఐ పిలిచినట్లు భావిస్తున్నామన్నారు. సీబీఐ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతామని గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్ర అన్నారు. వ్యక్తిగతంగా శ్రీనివాస్‌తో ఎలాంటి సంబంధాలు లేవని వ్యాఖ్యానించారు.

నకిలీ సీబీఐ అధికారి ముసుగులో డబ్బు ఎరచూపి శ్రీనివాస్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రలోభ పెడుతున్నట్లు గుర్తించిన దర్యాప్తు సంస్థ గత శనివారం దిల్లీలోని తమిళనాడు భవన్‌లో శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసింది. గ్రానైట్ కుంభకోణంలో తనకు ఉన్న పరిచయాల ద్వారా కేసులో ఉపశమనం వచ్చేలా చేయడానికి శ్రీనివాస్ ప్రయత్నం చేసినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.