ETV Bharat / state

'సినిమా వాళ్లకు అన్నీ ఇస్తూ... పేదలపై వివక్షెందుకు' - ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ తాజా వార్తలు

పేద ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని తెదేపా నేత గద్దె రామ్మోహన్‌ అన్నారు. కోట్లాది రూపాయలు సంపాదించుకున్న సినిమా వాళ్ల సమస్యల పట్ల చూపిన శ్రద్ధ... పేదల ఆకలి విషయంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. జగనన్న చేదోడు పథకం బోగస్ అని ఎద్దేవా చేశారు.

gadde rammohan
gadde rammohan
author img

By

Published : Jun 10, 2020, 12:40 PM IST

Updated : Jun 10, 2020, 2:26 PM IST

సినిమా వాళ్లు అడగ్గానే రాయితీలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్​కు...పేదలకి సాయం చేసేందుకు ఎందుకు చేతులు రావట్లేదని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మండిపడ్డారు. కోట్లాది రూపాయలు సంపాదించుకున్న సినిమా వాళ్ల సమస్యల పట్ల చూపిన శ్రద్ధ పేదల ఆకలి విషయంలో ఎందుకు లేదని విమర్శించారు. సినిమా వాళ్ల సమస్యలను పరిష్కరించటంలో తప్పులేదు కానీ... అన్ని వర్గాల సమస్యలు పరిష్కరించే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అని గద్దె నిలదీశారు. విద్యుత్ బిల్లులు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపారని దుయ్యబట్టారు. సినిమా వాళ్లకి అడిగిందల్లా చేస్తూ పేదల సమస్యల పట్ల ఇంత వివక్ష ఎందుకని ప్రశ్నించారు.

'జగనన్న చేదోడు' పథకం ఓ బోగస్ అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విమర్శించారు. సొంత దుకాణాలున్న రజకులు, నాయీబ్రాహ్మణులు చాలా తక్కువ మంది ఉంటారన్న ఆయన....పేరుకు మాత్రం అందరికీ ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆక్షేపించారు.

ఇదీ చదవండి

'పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం'

Last Updated : Jun 10, 2020, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.