కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద నిర్మించనున్న ఉక్కు కర్మాగారం కోసం రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ పరిశ్రమ కోసం 250 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఈ కర్మాగారం పూర్తయితే సుమారు 25 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. గత ఏడాది డిసెంబర్లో ముఖ్యమంత్రి జగన్ కన్యతీర్థం పరిశ్రమకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 10 వేల కోట్ల రూపాయలతో 3 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఉక్కు పరిశ్రమని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా 2020-20 బడ్జెట్లో 250 కోట్ల రూపాయలు కేటాయించటంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: బడుగులకు భరోసా...పేదలకు బాసట