కృష్ణా జిల్లాలోని దివిసీమలో గతంలో పాముల బెడద ఉండేది. అయితే ఈ ఏడాది అక్కడి రైతులను కప్పలు కలవరపెడుతున్నాయి. కోడూరు మండలంలోని పిట్టలంక, విశ్వనాధపల్లెలోని పలు ప్రాంతాల్లో నారుమళ్లు పోసుకున్న రైతులకు పసుపు పచ్చ రంగులో ఉన్న కప్పల దండు తలనొప్పిగా మారాయి.
రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు భూమి లోపల ఉన్న కప్పలు ఒక్కసారిగా బయటకు వచ్చి వందల సంఖ్యలో నారుమళ్లలోకి చేరాయి. వాటి గంతుల వల్ల విత్తనాలు పోగులు పడటం, భూములో దిగటం వల్ల మొలకలు రాక నష్ట పోవాల్సి వస్తుందని రైతులు చెప్పారు. దీనివల్ల మొలక శాతం తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కప్పలను తరిమేందుకు నారుమళ్లలో దిగితే కాళ్ల కింద విత్తనాలు పడి నష్టపోవాల్సి వస్తుందని కొంతమంది రైతులు తెలిపారు. ఈ కారణంగా కళ్లముందే కప్పలు నారుమళ్లకు నష్టం కలిగిస్తున్నా.. ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి