కృష్ణాజిల్లా మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనంగా ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాలలోని కోర్సులు విద్యా విధానం, విద్యార్థులలో క్రమశిక్షణ వంటి పలు అంశాలను యాజమాన్యం వివరించింది. ప్రతి విద్యార్థి తన విద్యపై శ్రద్ధ పెట్టి, తమ బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని కళాశాల వైస్ చైర్మన్ లక్కిరెడ్డి ప్రసాద్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. హాజరు శాతం, ఉత్తీర్ణతలో ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. కార్యక్రమానికి కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇన్ఫ్రా డైరెక్టర్ తిమ్మారెడ్డి, ప్రిన్సిపల్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ఇది చూడండి: 'వైకాపా ప్రభుత్వానికి.. ఎందుకంత అసహనం'
కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ...