ETV Bharat / state

బాబోయ్​ పాములు.. భయాందోళనలో రైతులు

వర్షాలు పడిన ఆనందంతో పొలం పనులు మొదలుపెట్టిన కృష్ణా జిల్లా రైతులకు పాముల రూపంలో కొత్త సమస్య వచ్చింది. వర్షపు నీరు కలుగుల్లోకి వెళ్లడం వల్ల బయటకు వస్తున్న పాములు ఎక్కడపడితే అక్కడ తలదాచుకుంటూ..... దగ్గరికి వచ్చిన వారిని కాటేస్తున్నాయి. పాముకాటుకు గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

formers-suffering-for-snakes
author img

By

Published : Jul 23, 2019, 7:02 AM IST

పాములు రైతులను భయపెడుతున్నాయ్

వర్షాలు పడుతుంటే ఓవైపు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంటే.. కృష్ణా జిల్లా రైతుల్లో మాత్రం ఆందోళన పెరుగుతోంది. నాట్ల సమయంలో రైతులను పాముల బెడద వేధిస్తోంది. వర్షాలు పడుతున్న కొద్దీ పాముకాటుకు గురయ్యేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో పాముకాటుకు గురై ముగ్గురు చనిపోయారు. గత వారంలో బుధవారం ఒక్కరోజే అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో 4 పాముకాటు కేసులు నమోదయ్యాయి.

గత ఏడాది ఒక్క అవనిగడ్డ ఏరియా ఆస్పత్రిలోనే 670 పాముకాటు కేసులు నమోదయ్యాయి. కృష్ణా నది లంక భూముల్లో పశువులనూ పాములు కాటేస్తున్నాయి. పొలాల్లోనే కాకుండా ఇళ్లు, దుకాణాలు వంటి ప్రదేశాలలోనూ పాముకాటుకు గురై అనేకమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు వెంటనే స్పందించి రోగులకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఇద్దరు పాముకాటుకు గురయ్యారు. విధుల్లో ఉన్న క్యాంటీన్ సెక్యూరిటీ గార్డు, ఐదేళ్ల బాలికను పాము కాటేసింది. ఇద్దరినీ విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఆయా గ్రామాల్లో సరైన రహదారులు లేక కొంతమంది.. ఆస్పత్రికి సకాలంలో చేరుకోలేక మరికొంత మంది మృత్యువాతపడుతున్నారు. పాములు, పాముకాట్లపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని అటవీ అధికారులను పలువురు కోరుతున్నారు.

Intro:ap_vja_22_22_barya_pai_bhartha_dhadi_avb_ap 10122. కృష్ణా జిల్లా నూజివీడు మండలం కొత్త రావిచర్ల గ్రామంలో భార్యపై భర్త కత్తితో దాడి గ్రామానికి చెందిన nimmakuri భీమరాజు ఆయన భార్య రమాదేవి కొద్ది కాలం దూరంగా ఉంటున్నారు ఈ క్రమంలో రమాదేవి సమీపంలోని చర్చికి వెళ్తుండగా ఆమె భర్త భీమరాజు దారికాచి కత్తితో దాడి చేసినట్లు రమాదేవి బంధువులు తెలిపారు కత్తితో దాడి చేయడంతో చేతిపై 3 వేళ్లు గాయాలయ్యాయి ఆమెను నూజివీడు ఏరియా హాస్పటల్ కు వైద్యం నిమిత్తం తీసుకువచ్చారు ఆ పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. 1) రమాదేవి బాధితురాలు. ( సార్ కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:నూజివీడు మండలం కొత్త రావిచర్ల లో భార్యపై భర్త కత్తితో దాడి

Conclusion:నూజివీడు మండలం కొత్త రావిచర్ల లో భార్యపై భర్త కత్తితో దాడి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.