మచిలీపట్నం వైకాపా నాయకుడు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు మచిలీపట్నం రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. అనుమతి వచ్చిన అనంతరం ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించనున్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు
తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం రాత్రి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు అత్యంత గోప్యంగా వ్యవహరించారు. చివరకు పెడన నియోజకవర్గంలోని గూడూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొల్లు రవీంద్రకు కరోనా, ఇతర వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
ఇదీ చదవండి: మచిలీపట్నం కోర్టుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర