పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా మైలవరం మండలం చండ్రగూడెంలో మాజీ మంత్రి దేవినేని ఉమా పర్యటించారు. తుపాన్ ధాటికి దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
నియోజకవర్గంలో రైతులకు భరోసా ఇవ్వాల్సిన స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అ భద్రతా భావంతో అసెంబ్లీలో సైతం తనపై ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఉమా ఎద్దేవా చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీపై ఇప్పటివరకు స్పష్టత తేలేకపోవడం నియోజకవర్గ ఎమ్మెల్యే వైఫల్యమని అన్నారు. తెదేపా రైతులకు ఎళ్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి