ETV Bharat / state

'నారా లోకేశ్‌ను జైలులో పెట్టేందుకు కుట్ర' - సీఎం జగన్​పై దేవినేని ఉమా తాజా సమాచారం

నారా లోకేశ్​ను జైల్లో పెట్టేందుకు కుట్రపన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్​పై తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. జే ట్యాక్స్ అందినందుకే అక్రమ మైనింగ్ దోషుల్ని ముఖ్యమంత్రి కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

devineni Uma
మాజీ మంత్రి దేవినేని ఉమా
author img

By

Published : Aug 5, 2021, 10:21 PM IST

Updated : Aug 6, 2021, 6:24 AM IST

రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా అనేది లేదని, చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తూ పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న ఆయన బెయిల్‌ రావడంతో గురువారం మధ్యాహ్నం 1.30కి విడుదలయ్యారు. జైలు దగ్గర విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మైనింగ్‌ అక్రమాలను చూపించడానికి తాను కొండపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లినప్పుడు.. కారులో ఉన్న తనపై పోలీసుల సమక్షంలోనే దాడి జరిగిందని, గూండాలు కారు ముందు అద్దాలు పగలగొడితే, పోలీసులు పక్క అద్దాలు పగలగొట్టారని చెప్పారు.

ఆరు గంటలపాటు తాను కారులోనే ఉన్నానని, తనను అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అరెస్టు చేసి 14 గంటలపాటు రెండు పోలీసు స్టేషన్లకు తిప్పారని, తప్పుడు కేసులుపెట్టి మర్నాడు రాత్రికి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తీసుకువచ్చారన్నారు. విడుదల సమయంలో జైలు దగ్గరకు తనను కలిసేందుకు వచ్చిన నాయకులను, మీడియాను తోసివేయడం దారుణమన్నారు. తప్పుడు కేసులకు భయపడేదిలేదని, పోరాటాన్ని తీవ్రం చేస్తామన్నారు. ఉమా వెంట తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం, రాజమహేంద్రవరం గ్రామీణం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్‌రఫీ ఉన్నారు.

ఉమా విడుదల సందర్భంగా కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలువురు తెదేపా నేతలను గృహ నిర్బంధం చేశారు. కారాగారం దగ్గర నలుగురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, తొమ్మిది మంది ఎస్సైలు, 60 మందికిపైగా బందోబస్తు నిర్వహించారు. ఉమా విడుదల సమయంలో గంటపాటు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

నారా లోకేశ్‌ను జైలులో పెట్టేందుకు కుట్రపన్నుతున్నారు

ఉమా కాన్వాయ్‌ అడ్డగింత..

జైలు నుంచి విడుదలైన దేవినేని ఉమా రాజమహేంద్రవరం నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలతో భారీ కాన్వాయ్‌తో విజయవాడ సమీపంలోని గొల్లపూడికి బయలుదేరారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శింగవరం దగ్గర రహదారి పక్కన హోటల్‌లో భోజనం చేసేందుకు వెళ్తుండగా ఉమా కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రహదారికి అడ్డంగా లారీలను అడ్డుగా పెట్టి నాయకులు, కార్యకర్తల కార్లను నిలిపేసి దేవినేని ప్రయాణిస్తున్న ఒక్క వాహనాన్నే అనుమతించారు. కాన్వాయ్‌లోని మిగిలిన వాహనాలను అడ్డుకోవడంతో ఉమా, పట్టాభి, ఇతర నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. పోలీసులు కొద్దిసేపటి తర్వాత వాహనాలను వదిలిపెట్టారు. అక్కడ నుంచి అప్పనవీడు కూడలికి చేరుకున్న ఉమాను వాహనం దిగకుండా పోలీసులు అడ్డుకున్నారు. కూడలిలోని ఆంజనేయస్వామి ఆలయం, దుకాణాలను ముందుగానే మూయించారు. ఉమా వాహనం దిగకుండానే అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.

ఆలయాన్నీ మూసేశారు...

ఉమా రాక సందర్భంగా కృష్ణాజిల్లాలోని హనుమాన్‌జంక్షన్‌లో ఉదయం నుంచే పోలీసులు భారీగా మోహరించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో దుకాణాలన్నీ మూసివేయించారు. అభయాంజనేయస్వామి ఆలయాన్నీ రెండు గంటలకు పైగా మూసి ఉంచారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఉమా వాహనం జంక్షన్‌కు చేరుకుంది. స్వామిని దర్శించుకునేందుకు ఆయన కారు దిగడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆగేందుకు అనుమతి లేదని, నేరుగా వెళ్లిపోవాలంటూ సూచించారు. దీనిపై ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిని దర్శించుకోవడానికీ మీ అనుమతి కావాలా అంటూ మండిపడ్డారు. పావు గంటకు పైగా గుడి దగ్గరే కారులోనే ఉండిపోయారు. ఆ తర్వాత పోలీసులు నచ్చజెప్పడంతో అభిమానులకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు.

లోకేశ్‌ అరెస్టుకు కుట్ర పన్నుతున్నారు..

చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ను వచ్చే నెలలో జైలులో పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. గొల్లపూడిలోని తన నివాసంలో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, అందుకే తనపై, మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుపై, ఇతర నాయకులపై కేసులు పెడుతున్నారన్నారు. ఉమా రాకతో గొల్లపూడిలోని నివాసానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాల్చారు.

జగన్‌కు చెంపపెట్టు..

దేవినేని ఉమాకు బెయిల్‌ రావడం సీఎం జగన్‌కు చెంపపెట్టు.. అని తెదేపా నేతÅ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు. రాజమహేంద్రవరం వచ్చిన ఆయన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఉమా కస్టడీ పిటిషన్‌ తిరస్కరణ

రిమాండ్‌లో ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావును తమ కస్టడీకి కోరుతూ మచిలీపట్నంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయమూర్తి, పదో అదనపు జిల్లా జడ్జి ఎ.నరసింహమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషన్‌పై గురువారం విచారణ నిర్వహించారు. కస్టడీకి ఇవ్వడానికి పోలీసులు సరైన కారణాలు చూపలేదని, ఉమామహేశ్వరరావుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని, వీటిని పరిగణనలోకి తీసుకుని పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.

ఇదీ చదవండి:

CBN: దేవినేని కాన్వాయ్​ను అడ్డుకోవటం హేయం: చంద్రబాబు

Last Updated : Aug 6, 2021, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.