ఆదివాసీలకు అన్యాయం చేసే తీర్పుపై జగన్ ప్రభుత్వం ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లలేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీసభ్యులు నరహరిప్రసాద్ ప్రశ్నించారు. ఆదివాసీల ఉద్యోగాలు కాజేయాలన్న అక్కసుతో కొందరు జీవో నెంబర్3 పై సుప్రీంకోర్టుకు వెళ్తే.. గిరిజనులకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయలేకపోయిదని విమర్శించారు.
జగన్ ప్రభుత్వం 6 నెలల నుంచీ నిమ్మకు నీరెత్తినట్లుగానే ఈ విషయంలో వ్యవహరిస్తోందని అన్నారు. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడవిబిడ్డలు బంద్కు పిలుపునిచ్చారని వెల్లడించారు. వైకాపా సర్కారులో గిరిపుత్రుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందనడంలో ఎలాంటి సందేహమూ లేదని ధ్వజమెత్తారు.
ఇదీ చూడండి: