ETV Bharat / state

పిచ్చి కుక్క స్వైర విహారం.. ఐదుగురికి గాయాలు - కృష్ణా జిల్లా చందర్లపాడు

కృష్ణా జిల్లా చందర్లపాడులో పిచ్చికుక్క స్వైరవిహారం చేసి.. ఐదుగురిని గాయపరిచింది. గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

five people got injured with dog bite in chandarlapadu at krishna district
పిచ్చి కుక్క స్వైర విహారం.. ఐదుగురికి గాయాలు
author img

By

Published : Feb 20, 2021, 9:50 AM IST

కృష్ణా జిల్లా చందర్లపాడులో శుక్రవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసి ఐదుగురిని గాయపరిచింది. ఉన్నత పాఠశాలను శుభ్రం చేస్తున్న వాచ్​మెన్​పై దాడి చేసింది. ఆయన కేకలు వేశారు. అక్కడే ఉన్న కొందరు కుక్కను తరమడానికి వెళ్లగా వారిలో మరో ఇద్దరిని కరిచింది.

గ్రామస్థులు పొలాల్లోకి తరమగా అక్కడ కూడా... మరో ఇద్దరిని గాయపరిచింది. గాయపడిన ఐదుగురిని చికిత్స కోసం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అధికారులు స్పందించి శునకాలను అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

అన్నక్యాంటీన్లలో ఆప్కో షోరూంలు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.