కృష్ణా జిల్లా కంచికచర్ల 65 నెంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు... కంచికచర్ల బైపాస్ ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జుకాగా.. కిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే ఐదుగురు వైద్యులకు గాయాలయ్యాయి. డివైడర్ మధ్యలో ఏర్పాటుచేసిన విద్యుత్ దీపాలు వెలుగకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని.. కార్లో ప్రయాణిస్తున్న వైద్యులు పేర్కొన్నారు. జాతీయ రహదారి కాంట్రాక్టర్ నిర్లక్ష్య ధోరణి ప్రయాణికుల పాలిట యమపాశంగా మారిందని ప్రముఖ వైద్యుడు ప్రమోద్ మండిపడ్డారు.
జాతీయ రహదారిపై రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో కాంట్రాక్టర్ ఎటువంటి భద్రత ప్రమాణాలు చేపట్టకుండా వ్యవహరించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. రహదారి పై పనులు జరిగే సమయంలో కాంట్రాక్టర్ క్రింది స్థాయి సిబ్బందికి సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు.. రాత్రి సమయంలో రహదారిపై ఎటువంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా పనులు నిర్వహించరాదన్నారు. ఈ ప్రమాదంపై సంబంధిత రోడ్డు కాంట్రాక్టర్ పూర్తి బాధ్యత వహించాలని అని పేర్కొన్నారు.. కంచికచర్ల రూరల్ సీఐ సతీష్ ఘటనా స్థలానికి చేరుకొని సిబ్బందితో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.
ఇదీ చూడండి. దూసనపూడి సర్పంచ్‌పై అర్ధరాత్రి దాడి