మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజును బెస్త సంక్షేమ సంఘం నేతలు ఘనంగా సత్కరించారు. విజయవాడలోని మంత్రి నివాసంలో మంత్రిని కలిసిన గంగపుత్రులు అప్పలరాజుకు గజమాలతో సన్మానం చేశారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి బెస్త సంఘీయులు తరలివచ్చి మంత్రికి శాలువాలు కప్పి సన్మానం చేసినట్లు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు బెస్త తెలిపారు.
ఎల్లప్పుడు అందుబాటులోనే..
గంగపుత్రులకు తాము ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని మంత్రి చెప్పడం పట్ల వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన రాయితీలను అందజేస్తామని మంత్రి స్పష్టం చేయడం శుభపరిణామమన్నారు. బెస్త, గంగపుత్రుల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు చేపట్టాలని మంత్రిని కోరినట్లు ఆయన వెల్లడించారు. తమ సమస్యల పరిష్కారానికి మంత్రి అప్పలరాజు సానుకూలంగా స్పందించినట్లు సంఘం నేతలు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: