లాక్డౌన్ సమయంలో నేడు విజయవాడకు తొలి ప్రయాణికుల రైలు స్టేషన్కు చేరుకోనుంది. న్యూదిల్లీ - చెన్నై ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలు మధ్యాహ్నం 2.30 గంటలకు 250 మంది ప్రయాణికులతో విజయవాడకు రానుంది. ప్రయాణికులందరికీ పరీక్షలు నిర్వహించిన తరువాతే ప్రత్యేక బస్సుల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు.
ఇదే రైలులో విజయవాడ నుంచి చైన్నైకు 300 మంది వలస కూలీలను తరలించనున్నారు. చైన్నై వెళ్లే ప్రయాణికులు గంట ముందుగానే స్టేషన్కు చేరుకోవాలని అధికారులు ఆదేశించారు. రిజర్వేషన్ చేయించుకున్న వారిని మాత్రమే స్టేషన్ లోపలికి అనుమతించనున్నారు.
ఇదీ చదవండి: పాత్రికేయులపై చిటింగ్ కేసు... ఎందుకో తెలుసా??