సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పాశ మైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిర్మల ఎంటర్ ప్రైజెస్ పరిశ్రమలో ఏర్పడిన మంటలు పక్కనే ఉన్న మరో రెండు పరిశ్రమలకి అంటుకోవడంతో ఆ పరిశ్రమలూ పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు ఐదు అగ్నిమాపక యంత్రాల సహాయంతో అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ఘటనా పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. రసాయనల పేలుళ్ల శబ్ధంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చూడండి:ఆంధ్ర అబ్బాయి... తెలంగాణ అమ్మాయి... ప్రేమ వివాదం...