కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం రామనపూడిలో.. ఓ ఏజెన్సీ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్లో నిల్వ ఉంచిన హైడ్రోజన్ పెరాక్సైడ్ రసాయనాల వలనే.. మంటలు చెలరేగినట్టు స్థానికులు ఆరోపించారు.
గోడౌన్ పక్కనే పెట్రోల్ బంక్ ఉన్న కారణంగా.. పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పెను ప్రమాదం తప్పించారు.
ఇదీ చదవండి: