ETV Bharat / state

నాన్న లే నాన్నా..! ఎందుకు పడుకున్నావ్..!

చిన్నప్పుడే అమ్మ చనిపోతే..నాన్నే అన్ని అనుకుంది ఆ పాప. నాన్నతో పాటే తినేది నవ్వేది...కొంచెం అలిగేది. ఎప్పటికి తనతోనే ఉంటాడని ధైర్యం.. నిన్నటిదాకా తండ్రి చేయిని పట్టుకుంది ఆ చిన్నారి. ఉన్న ఊరి నుంచి బయటికి వచ్చి.. ఓ ప్రాంతంలో తలదాచుకున్నా అల్లరిమూకలు వారిని వదలలేదు. కనికరించి స్థానికులు తండ్రిని ఆసుపత్రిలో...పాపను బాలసదన్​లో చేర్పించారు. తండ్రి అనారోగ్యంగా ఎందుకు ఉన్నాడో ఆ పసిదానికి తెలియదు. బాలసదన్​లోనేగా ఉండేది..నాన్న చూడటానికి రోజూ వస్తాడు అనుకుంది ఆ పాప. నిన్నటిదాకా తనతో ఉన్న నాన్న.. ఉన్నట్టుండి చనిపోయాడు.

father died at machilipatnam
మచిలీపట్నంలో తండ్రీ కూతురు
author img

By

Published : Sep 10, 2020, 9:38 AM IST

పేగు పంచిన అమ్మ ఊసులాడకుండానే ఊపిరొదిలేసింది..నేనున్నానంటూ చేయిపట్టి నడిపించిన నాన్న ఆయువొదిలేశాడు.ఇప్పుడా చిన్నారి ఒంటరైంది..నిర్జీవంగా పడిఉన్న నాన్న దేహాన్ని చూసి నిద్రిస్తున్నాడనుకొంటోంది ..ఓసారి లే నాన్నా అంటూ అమాయకంగా అడుగుతోంది..!ఎప్పటికీ లేవడని తెలిస్తే ఆ పసిమనసు ఏమైపోతుందో?

కృష్ణా జిల్లా కోరుకొల్లు నుంచి మచిలీపట్నం చేరిన తండ్రీకూతురి జీవితం మరో మలుపు తిరిగింది. బందరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి రాము బుధవారం మధ్యాహ్నం మరణించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు బాల సదనం పర్యవేక్షణాధికారి డి.జ్యోత్స్నకు తెలిపాయి. ఆమె పాప వైష్ణవీదుర్గను తీసుకొని ఆసుపత్రికి వెళ్లారు. నేలపై పడుకొని ఉన్న తన తండ్రి చనిపోయాడని ఆ చిన్నారికి తెలియదు. ఒంట్లో బాగాలేక నిద్రపోతున్నాడనుకుంది. తరవాత చిన్నారిని తిరిగి బాలసదనానికి తీసుకెళ్లిపోయారు. రాము కోసం ఎవరూ రాకపోవడంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించిన కలిదిండి అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ నాగలక్ష్మికి సమాచారాన్ని అందించారు. రాము దహనసంస్కారాలకు ఆసుపత్రి వర్గాలే ఏర్పాట్లు చేస్తున్నాయి. చిన్నారి వైష్ణవి పరిస్థితి దయనీయంగా మారింది. పాపను సురక్షితంగా చూసుకుంటామని, ఆమె బాగోగులు శ్రద్ధగా చూసుకుంటామని జ్యోత్స్న తెలిపారు.

ఇదీ చూడండి: అండగా నిలిచారు..ఆకలి తీర్చారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.