కృష్ణా జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద రెండు ఫాస్టాగ్ ట్రాక్ లైన్లు, రెండు క్యాష్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఫాస్టాగ్ ట్రాక్ సరిగా పనిచేయక పోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు ఒక్కసారిగా క్యాష్ కౌంటర్ల వైపు మొగ్గు చూపడం వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే ఫాస్టాగ్ స్టిక్కర్ వేయించుకున్న వాహనాలను టోల్ గేట్లో సరిగా గుర్తించటం లేదు. అలాగే చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద సైతం పాస్ట్ టాగ్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తమ వాహనాలకు కొత్తగా ఫాస్టాగ్ స్టిక్కర్ వేయించుకునే వారికి చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద రెండు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అనంతరం క్యాష్ కౌంటర్ల ద్వారా నిర్వాహకులు టోల్ వసూలు చేశారు.
ఇదీ చూడండి: