కృష్ణాజిల్లా నాగాయలంక మండలం బర్రంకుల పరిసర గ్రామాల్లో వరి నారుమడులు మునిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగలేరు మురుగు డ్రెయిన్‌పై వలకట్లు కట్టడంతో మురుగు నీరు సముద్రంలోకి వెళ్లడానికి... అడ్డుగా పాతిన కర్రలు, వలల మూలంగా వర్షం పడినప్పుడు నీరు కిందకి వెళ్లలేక వందల ఎకరాల్లో నాటిన వరి నారుమడులు నీటిలో మునిగిపోయాయి. సంబంధిత డ్రైనేజీ అధికారులు వెంటనే స్పందించి వలకట్లు తొలగించాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
' కరోనా కమ్మేస్తుంటే వైకాపా నాయకుల హడావిడి... జాగ్రత్తలు పట్టవా'