ఇదీ చదవండి:
భుజంపై నాగలితో తహసీల్దార్ కార్యాలయానికి రైతు.. ఎందుకంటే..? - farmer variety agitation news
రెవెన్యూ అధికారులు తన భూమి కొలవకుండానే కొలిచినట్లు తప్పుడు నివేదికలు సృష్టించారని ఓ రైతు ఆవేదన చెందాడు. తనకు న్యాయం చేయాలని ఎమ్మార్వో కార్యాలయంలో వినూత్నంగా నిరసన తెలిపాడు. మరి ఆ వినూత్న నిరసనేంటో మనమూ తెలుసుకుందామా..!
సర్వేయర్ భూమి కొలవటం లేదని రైతు వినూత్న నిరసన
రెవెన్యూ అధికారులు తన భూమిని సర్వే చేయడం లేదంటూ కృష్ణా జిల్లా నందిగామ తహసీల్దార్ కార్యాలయంలో దుర్గాకుమార్ అనే రైతు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. భుజంపై నాగలి మోస్తూ ఎమ్మార్వో కార్యాలయం ముందే బైఠాయించారు. భూ కబ్జాదారులకు అధికారులు అండగా ఉన్నారని రైతు ఆరోపించారు. తమ భూమిని కొలవకుండానే కొలిచినట్లు తప్పుడు నివేదికలు ఇచ్చారని వాపోయారు. అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నా, కొలతలకు సర్వేయర్ రావటం లేదని అన్నారు. దీని వల్ల తమ పొలాన్ని కొంతమంది ఆక్రమించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయకపోతే వైయస్ఆర్ విగ్రహం ఎదుట నిరసన చేపడతానని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
sample description