..
భూములు వదిలేశాం... ప్రాణాలు వదిలేస్తాం...! - మందడంలో రైతుల ధర్నా
పోలీసు చర్యలు వ్యతిరేకిస్తూ మందడం ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. గ్రామం మీదుగా సీఎం అసెంబ్లీ వెళ్లే అవకాశం ఉండటంతో పూర్తి స్థాయిలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఈ సందర్భంగా డ్రోన్లు వినియోగిస్తూ భద్రత పర్యవేక్షిస్తుండగా... ఈ చర్యలను గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. ఇళ్లపై డ్రోన్లు తిప్పడాన్ని వ్యతిరేకిస్తూ నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటిపై నల్లజెండాలు కట్టిన సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు ఉన్న బోర్డులను ఇంటి గోడలకు పెట్టారు. నల్లజెండాలతో నిరసన చేస్తున్న రైతును పోలీసులు అడ్డుకున్నారు. నిరసన కూడా తెలపనివ్వడంలేదు... భూములు వదిలేసాం... ఇప్పుడు ప్రాణాల్ని వదిలేస్తాం... మమ్మల్ని చంపేయండి అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
మందడంలో రైతు నిరసన
..
sample description