కృష్ణ జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భంలో శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు. గుడివాడకు చెందిన మహిళకు నొప్పులు రావడంతో తెల్లవారుజామున మూడున్నరకు ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఉదయం ఎనిమిదిన్నరకు గర్భంలో శిశువు మరణించిందని వైద్యులు చెప్పారు. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో అద్దాలు ధ్వంసం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే బిడ్డ మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు నెలలు నిండక పోవడంతోనే.. గర్భంలో బిడ్డ మరణించినట్లు వైద్యులు తెలుపుతున్నారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే.. గర్భంలోని బిడ్డ మరణించిందని.. - గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి తాజా సమాచారం
వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భంలో శిశువు మరణించాడంటూ బాధిత కుటుంబ సభ్యులు.. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. మరోవైపు నెలలు నిండక పోవడంతోనే.. గర్భంలో బిడ్డ మరణించినట్లు వైద్యులు తెలుపుతున్నారు.