Fake documents Gang: కృష్ణాజిల్లా ఘంటసాలపాలెంలో స్థలాలు విక్రయించేందుకు తప్పుడు పత్రాలు ఉపయోగించటమే కాకుండా.. తన ఫొటోతో వేరే వారి పేరుతో బ్యాంకు ఖాతా తెరిచి రూ.40లక్షలు మేర వసూళ్లు చేశారు. దీనిపై.. గవర్నర్ పేట పోలీసులు ఈ నెల 7న కేసు నమోదు చేశారు. కృష్ణాజిల్లా ఘంటసాలపాలెం, కొత్తపల్లి గ్రామానికి చెందిన తుమ్మల ప్రమోద్ కుమార్ స్థిరాస్తి వ్యాపారం చేస్తుంటారు.
ఇతను అర్జున్ లాల్ అనే వ్యక్తికి చెందిన స్థిరాస్తులకు జీపీఏ హోల్డర్‌గా ఉన్నారు. బిర్జిపల్లి వెంకటేష్ బాబు అనే వ్యక్తి.. ప్రమోద కుమార్ దగ్గరి బంధువు అయితే.. నకిలీ ఆధార్ సృష్టించి తానే ప్రమోద్‌కుమార్‌గా నకిలీ డాక్యుమెంట్లతో స్థలాలను విక్రయించాడు. కాగా ఈ స్థలాలన్నీ తెలంగాణ, పటాన్‌చెరువులో వివిధ సర్వేనెంబర్లలో ఉన్నాయి. ప్రస్తుతం వెంకటేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ 40లక్షలు వసూలు చేసినట్లు తేలింది. ఇంకా ఏమైనా నగదు వసూలు చేశారా దీంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: