ETV Bharat / state

FAKE CHALLANS: రూ.2.5 కోట్ల నకిలీ చలానాల గుర్తింపు

author img

By

Published : Aug 19, 2021, 3:44 PM IST

Updated : Aug 19, 2021, 10:58 PM IST

FAKE CHALLANS
FAKE CHALLANS

15:37 August 19

fake challans in sub registrar offices

రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మండవల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కృష్ణా జిల్లా మండవల్లి, నెల్లూరు జిల్లా నాయుడుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రూ.2.5 కోట్ల నకిలీ చలానాలు అధికారులు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తోడేకొద్ది అవినీతి బాగోతాలు బయటపడుతున్నాయి. 

మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2 కోట్ల 60 లక్షల మేర చలానాల అవకతవకలు జరిగినట్లు కృష్ణాజిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర రామారావు తెలిపారు. మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉపేంద్ర రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. 2019 అక్టోబర్ నెల నుంచి 2021 జులై 31 వరకు నిర్వహించిన తనిఖీల్లో సుమారు ఐదు వందల అరవై నకిలీ చలనాల ద్వారా సుమారు రెండు కోట్ల 60 లక్షల మేర అవకతవకలు జరిగినట్లు ఆయన చెప్పారు. నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి నోటీసులు జారీ చేసి.. లిఖిత పూర్వకమైన సమాధానం తీసుకుంటామని ఉపేంద్ర రామారావు తెలియజేశారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వివరాలను తెలియజేయాలని ఆయన సూచించారు. అవినీతి జరిగిన ప్రతి రూపాయి వెనక్కి తీసుకు వస్తామని.. అక్రమార్కులను వదిలే ప్రసక్తి లేదని, అవకతవకలపై ఇప్పటికే పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు రిజిస్ట్రార్ రామారావు చెప్పారు.

నాయుడు పేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో..

నెల్లూరు జిల్లా నాయుడుపేట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నకిలీ చలానాల విషయంలో రూ.5.24లక్షల అవకతవకలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. పలు రిజిస్ట్రేషన్​లకు సంబంధించి ఆన్​లైన్ చలానాలు తీయడంలో గోల్​మాల్ జరిగిందని గుర్తించారు. మూడు రోజుల క్రితం చిత్తూరు జిల్లా అధికారి ఒకరు కార్యాలయంలో తనిఖీ చేశారు. ఆయన ఎటువంటి అవకతవకలు జరగలేదని తప్పుడు సమాచారం ఇచ్చారని.. తీరా రెండు రోజుల తర్వాత అసలు గుట్టు రట్టు అయినట్లు అధికారులు తెలిపారు. కొంత కాలంగా ఒక డాక్యుమెంట్ రైటర్ చలానాల విషయంలో మోసం చేసారని తెలుస్తోంది. కార్యాలయ సబ్ రిజిస్ట్రార్​గా పని చేస్తున్న అధికారిణి మధ్యాహ్నం బాధ్యతలు జూనియర్ అసిస్టెంట్​కు అప్పగించి వెళ్లిపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులెవరైనా వదిలేది లేదని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోజుకు ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ కుంభకోణం వెలుగుచూస్తుండటం కలకలం రేపుతోంది.

ఇదీ చదవండి:  

విజయవాడ: కారులో మృతదేహం కేసు..రాహుల్​ది హత్యగా పోలీసుల నిర్దారణ!

నిజంగా..! తాలిబన్లు అధికారంలోకి వచ్చారని సంతోషిస్తున్నారా..!

Last Updated : Aug 19, 2021, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.