తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు, సమ్మెలపై మరో 6 నెలల పాటు నిషేధం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఈ నెల 23 తో ముగియడంతో మరో 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
వచ్చే ఏడాది మే 23 వరకు నిరసనలు, సమ్మెలపై నిషేధం అమలులో ఉంటుందని ప్రభుత్వం పేర్కోంది. గతంలో తితిదే ఉద్యోగులను ఎస్మా పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దానికి అనుగుణంగానే తిరుమలలో సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం మరోమారు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి: